గజపతినగరం మండల కేంద్రంలో స్థానిక భవాని లాడ్జి వెనుక గల చెరువు వద్ద నిర్వహించిన పేకాట స్థావరంపై ఎస్ఐ కే లక్ష్మణరావు బుధవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ. 5, 545 స్వాధీనం చేసుకుని పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.