గజపతినగరంలో హెల్మెట్ పై పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోమవారం బొబ్బిలి డిఎస్పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు హెల్మెట్ ధరించి పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ జరిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎస్సైలు లక్ష్మణరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.