నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిస్తున్నాం

82చూసినవారు
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. జామి మండలం కలగాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు. వందరోజుల ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేటట్లు, చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్