గంట్యాడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవి ఆర్ వి రమణమూర్తి ఆధ్వర్యంలో గురువారం రెండో రోజు ఉల్లాస్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలో వయోజన మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పది మంది వయోజన మహిళా నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ ను నియమించడం జరిగిందని తెలిపారు. మార్చి 25 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.