పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సిఐటియు నాయకులు గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు శానిటరీ ఇన్స్పెక్టర్ కర్రి ఫకీర్ స్వామికి వినతిపత్రం అందజేశారు. కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ ఏళ్ళ తరబడి కార్మిక సమస్యలు పరిష్కారం రావడంలేదని, గత ప్రభుత్వంలో కార్మికుల సమస్య కోసం 16 రోజుల సమ్మె చేశారని అన్నారు.