సాలూరు నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గ మధ్యలో కాన్వాయ్ దిగి నడుస్తూ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. కాన్వాయ్ వెళ్తుండగా పవన్ కళ్యాణ్ దిగడంతో సెక్యూరిటీ అలెర్ట్ అయింది. పవన్ కళ్యాణ్ చూసేందుకు జనం ఆసక్తి చూపారు. పవన్ నడుచుకుంటూ వెళ్లడంతో పొలాల్లో ఉన్న రైతులు చూసేందుకు పరుగులు తీశారు. పవనన్న పవన్ అన్న అంటూ అభిమానులు కేరింతలు పెట్టారు.