పెద్దఖండేపల్లిలో కొనసాగుతున్న సామాజిక పెన్షన్లు పంపిణీ

58చూసినవారు
పెద్దఖండేపల్లిలో కొనసాగుతున్న సామాజిక పెన్షన్లు పంపిణీ
ఎస్. కోట మండలంలోని స్థానిక పెద్దఖండేపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యిందని సాంఘిక సంక్షేమ అధికారి దేవేందర్ తెలిపారు. సాయంత్రంలోగా శతశాతం పూర్తిచేస్తామని సచివాలయం కార్యదర్శి తెలిపారు. కూటమి నేత అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్