ఎస్ కోట: మా గ్రామ సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దు

81చూసినవారు
మా గ్రామ సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని ఎస్. కోట మండలం శివరామరాజుపేటకు చెందిన మహిళలు శుక్రవారం నిరసన చేపట్టారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న షాపు ముందు బైఠాయించి మద్యం షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మార్గం గుండా విద్యార్థులు, మహిళలు రాకపోకలు సాగిస్తుంటారని, ఈ ప్రాంతంలో మద్యం షాపు కారణంగా భవిష్యత్తులో ఏదైనా జరిగితే బాధ్యత ఎవరని ప్రశ్నించారు. పోలీసులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్