వేపాడ: ఎట్టకేలకు గదబవలస గ్రామానికి రోడ్డు మంజూరు

63చూసినవారు
వేపాడ: ఎట్టకేలకు గదబవలస గ్రామానికి రోడ్డు మంజూరు
వేపాడ మండలం గదబవలస గ్రామ ప్రజలు దశాబ్దాల కాలం నుండి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు ఈ గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ పీఎం జన్మన్ కింద ప్రభుత్వం రూ. 2. 65 కోట్లు మంజూరు చేసినట్లు గతంలోనే ఎమ్మెల్యే లలిత కుమారి ప్రకటించారు. కాగా 2. 9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్