కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రాంతాల్లో సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.