ఢిల్లీలో షీష్ మహల్, ఏపీలోని రుషికొండ ప్యాలెస్‌లు నిర్మించడంపై సీఎం చంద్రబాబు కీలక ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న సీఎంలు ప్యాలెస్‌లు కట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రజలు ఆమోదించరు అని చెప్పడానికి, మొన్న ఆంధ్రప్రదేశ్, ఈ రోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ అని తెలిపారు. రెండు చోట్లా వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్‌లోకి ప్రజలు వెళ్ళనివ్వకుండా తీర్పు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు.