దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ఓ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాజీపేట – డోర్నకల్, డోర్నకల్–విజయవాడ, భద్రాచలం రోడ్డు–విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా.. మరో 9 రైళ్లను దారి మళ్లించారు. గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11 రోజుల పాటు అందుబాటులో ఉండవని తెలిపారు. ఖమ్మం వద్ద నాన్–ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.