SBI 169 పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ సివిల్ 42 పోస్టులు, ఎలక్ట్రికల్ 25, ఫైర్ 101, బ్యాక్‌లాగ్ 1 పోస్టుకు
బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం. జీతం రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఇస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంది. డిసెంబర్ 12లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.