ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగగా మహా కుంభమేళా ఒక చరిత్ర సృష్టించిందని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగగా, దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని, 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా UP ప్రభుత్వం వెల్లడించింది.