కడపలో ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. ఏడు రోడ్ల కూడలి వద్ద వెలిసిన ఈ పోస్టర్ స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలలో మొనగాడు, మగోడు లేడా అంటూ పోస్టర్ వెలియటంతో అందరూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఈ ప్రాంతవాసుల డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటంతో ఎవరో ఆగంతకులు ఇలా వినూత్నంగా నిరసన చేపట్టినట్లు భావిస్తున్నారు.