అద్దంకి: గుండ్లకమ్మ హద్దులు గుర్తింపుకు సర్వే
అద్దంకిలోని గుండ్లకమ్మ సరిహద్దులు గుర్తించేందుకు శుక్రవారం రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. సర్వేయర్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో హద్దులు సర్వే నిర్వహించారు. గుండ్లకమ్మ హద్దులు గుర్తించాలని పట్టణానికి చెందిన త్రిమూర్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం అధికారులు సర్వే చేపట్టారు. ఈ నెలాఖరులోపు సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని సర్వే శ్రీ లక్ష్మీ వెల్లడించారు.