గిద్దలూరు నియోజకవర్గంలో సోమవారం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈనెల 14వ తేదీ నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఇప్పటికే ప్రజల కోసం తుఫాన్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయటంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.