గిద్దలూరు: పోలీస్ స్టేషన్ ముందు నిరసన

80చూసినవారు
క్రిష్టంశెట్టిపల్లి సమీపంలోని సగిలేరు వాగులో ఈతకు వెళ్లి మృతి చెందిన ఆనంద్ కుటుంబ సభ్యులు బంధువులు గిద్దలూరు పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం నిరసనకు దిగారు. సోమవారం సగిలేరు వాగులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆనంద్ ను స్నేహితులే చంపారంటూ ఆనంద్ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. తమ కుమారుడి మృతిపై విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆనంద్ కుటుంబ సభ్యులు బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్