గిద్దలూరు: కొండచిలువ కలకలం

58చూసినవారు
గిద్దలూరు మండలం వేములకోట గ్రామంలో 8 అడుగుల కొండచిలువ గురువారం స్థానిక పొగాకు పొలాలలో కలకలం రేపింది. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించారు. తరువాత నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండచిలువను అధికారులు విడిచిపెట్టారు. కొండచిలువను బంధించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్