కొమరోలు పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షం

68చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి కొమరోలు పరిసర ప్రాంతాలలో మబ్బు పట్టి ఉంది. రాత్రి అయ్యేసరికి వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదు. కొమరోలు మండల పరిసర ప్రాంతాలలో రైతన్నలు మరిన్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్