కొండేపిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మి అనే వివాహితకు చెందిన ఇంట్లో చుట్టం చూపుకు వచ్చిన ఆమె స్నేహితులు 56 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో బంగారం చోరీకి పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దొంగిలించిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు.