నిస్వార్ధ సమాజ సేవ కోసమే ఆనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్టీఆర్ పట్ల ప్రజలు ఎంతో ఆరాధన భావంతో ఉండేవారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, మాజీ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పాల్గొన్నారు.