జాతిపితకు నివాళులు అర్పించిన ఎరిక్షన్ బాబు

70చూసినవారు
జాతిపితకు నివాళులు అర్పించిన ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బుధవారం టిడిపి కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మహాత్ముడి అడుగుజాడలే మనందరికీ ఆదర్శమని ఎరిక్షన్ బాబు అన్నారు. ఉప్పు సత్యాగ్రహంపై ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్