Dec 23, 2024, 04:12 IST/
వైద్యుడి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు (వీడియో)
Dec 23, 2024, 04:12 IST
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అమృత చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ చిన్నారి పరిస్థితి విషమించడంతో.. వైద్యులు కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చిన్నారి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి చనిపోయిందంటూ హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.