ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
కనిగిరి నియోజకవర్గం చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో ఆదివారం భక్తులు సందడి చేశారు. ఆదివారం కావడంతో పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో భైరవకోనకు చేరుకుని సుందరమైన జలపాతంలో స్నానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. భైరవేశ్వర స్వామి, త్రిముఖ దుర్గాంబ దేవికి పూజలు చేశారు.