హర్యానా రోహ్ తక్‌లోని PGIMS వైద్యులు 6 రోజులుగా ఒక వ్యక్తి గుండెలో ఇరుక్కున్న కత్తిని 4 గంటల పాటు శస్త్రచికిత్స చేసి తొలగించారు. సదరు వ్యక్తి ఘర్షణ సమయంలో కత్తి పోట్లకు గురయ్యాడు. హ్యాండిల్ విరిగిపోవడంతో బ్లేడ్ గుండెలో ఇరుక్కుపోయిందని సమాచారం. పదునైన వస్తువు గుండెలో ఉండిపోవడం అనే ఈ తరహా కేసును తాము తొలిసారి చూశామని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ & సీనియర్ కార్డియాక్ సర్జన్ SS. లోహ్బాబ్ చెప్పారు.