Mar 28, 2025, 16:03 IST/మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల: ఆర్.డి.ఓ ఆఫీస్ వద్ద వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిజ్
Mar 28, 2025, 16:03 IST
రైతుల శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఆర్.డి.ఓ గూడూరు శ్రీనివాస్ సూచన మేరకు రైతులకు త్రాగునీటి సదుపాయాన్ని కల్పించేలా వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిజ్ శుక్రవారం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ప్రారంభించి రైతులకు మేలును చేకూర్చే ఇలాంటి చర్యలు మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.