మయన్మార్, థాయ్‌లాండ్ భారీ భూకంపం ధాటికి విలవిల్లాడుతున్నాయి. వరుస భూకంపాల తీవ్రత కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ 167కి చేరుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో వందలాది మంది గాయపడటంతో.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.