జగనన్న కాలనీలో నీటి కొరత
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో నీటి కొరతతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం తెలిపారు. జగనన్న కాలనీలో ఉన్న నీటి బోరు చెడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పది రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే జగనన్న కాలనీలో ఉన్న నీటి బోరును మరమ్మత్తులు చేయించి నీటి సమస్య పరిష్కరించాలని కోరారు.