కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి

81చూసినవారు
కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో 30 గొర్రెపిల్లలు మృతి చెందాయి. కొంగలవీడు గ్రామానికి చెందిన రైతు మునిరాజు గొర్రెలను మేతకు తీసుకువెళ్తూ గొర్రె పిల్లలను దొడ్డిలో ఉంచి వెళ్ళాడు. ఎవరు లేని సమయాన్ని చూసి కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేశాయి. దీంతో రూ.1,50,000 వరకు ఆర్థిక నష్టం జరిగిందని రైతు మునిరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించాడు. ప్రభుత్వమే అదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్