బేస్తవారిపేట: అక్రమ గోవుల రవాణా

53చూసినవారు
బేస్తవారిపేట: అక్రమ గోవుల రవాణా
అక్రమ గోవుల రవాణాను బేస్తవారిపేట బిజెపి నాయకులు గురువారం అడ్డుకున్నారు. మండలంలోని చింతలపాలెం జాతీయ రహదారిపై ఓ కంటైనర్లో 60 ఆవులను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బిజెపి నాయకులు కంటైనర్ ని నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అక్రమంగా గోవులను తరలిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్