గిద్దలూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు విద్యుత్ అందించడంలో ఎటువంటి సమస్య ఉండకూడదని వారికి సూచించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అశోక్ రెడ్డి తెలిపారు.