ప్రకాశం జిల్లా, కొమరోలు పట్టణంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. వారు నడుపుతున్న 12 ద్విచక్ర వాహనాలకు భారీ జరిమానా విధించడంతో పాటు ద్విచక్ర వాహన యజమానులను మందలించారు. మరల మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై వెంకటేశ్వర నాయక్ వాహన యజమానులను విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించారు.