ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుములపల్లి గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పనికి వెళ్లిన ఉపాధి కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో మృతి చెందాడు. ఉపాధి హామీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురైన ఆంజనేయులను మిగతా కూలీలు హుటాహుటిన రాచర్ల లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.