పామూరు పంచాయతీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఇప్పటికే రెండు కేసులతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు మరో రెండు కేసులు బహిర్గతం కావడంతో పాలమూరు పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పామూరు పట్టణంలోని స్థానిక చెన్నకేశవ నగర్ ఒకటవ నగర్ కు చెందిన 14 ఏళ్ల విద్యార్థికి ఈనెల 1వ తేదీ టెస్ట్ నిర్వహించగా శనివారం పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ విద్యార్థి చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నాడు ఆ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 6 , 10 , 11 వార్డులో కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాలలో వారు వివిధ ఆంక్షలు ను తాసిల్దార్ ఉష, ఎస్సై చంద్రశేఖర యాదవ్, ఈవో ఆర్డి బ్రహ్మానందరెడ్డి లు విధించి ఆ వార్డులలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. శానిటేషన్ తో పాటు బ్లీచింగ్ తదితర చర్యలు చేపట్టారు.
ఆ ప్రాంతాలలో నివసించే వారందరికీ కరుణ కేసులు కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం చెన్నకేశవ నగర్ లో విద్యార్థి కరుణ రావడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈరోజు పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ వారు ఆదివారం నాడు చెన్నకేశవ నగర్ నందు పర్యటించి పలు టెస్ట్ నిర్వహిస్తున్నారు.