నైపుణ్య గణనతో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ తెలిపారు. కనిగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం సచివాలయ సిబ్బందికి నైపుణ్య గణన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నైపుణ్య గణనను కచ్చితంగా చేపట్టాలని తెలిపారు. సమర్థవంతంగా గణన నిర్వహించాలని సూచించారు.