దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గపూర్ తెలిపారు. కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ సోమవారం ఆర్డిఓ కేశవరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.