కనిగిరి పట్టణంలోని లాడ్జిలపై పోలీసులు దాడులు నిర్వహించారు. హనుమంతుని పాడు ఎస్సై కే. మాధవరావు ఆదివారం లాడ్జిలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జిలలో ఉంటున్న వారి వివరాలను పరిశీలించారు. ఐడి కార్డులను పరిశీలించి, ఎక్కడ నుండి వచ్చారని వివరాలను ఆరాతీశారు. లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.