కనిగిరిలోని పలు లాడ్జిలను హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై లాడ్జీలను తనిఖీ చేసి లాడ్జిలలో ఉంటున్న వారిని ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పనిపై వచ్చారో విచారించారు. ఈ సందర్భంగా లాడ్జి యాజమాన్యంతో ఎస్సై మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులను లాడ్జిలలో అనుమతించరాదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.