ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పై అత్యాచారం చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులపై ఉన్నత అధికారులు గురువారం విచారణకు ఆదేశించారు. విచారణకు ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లుగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. విచారణలో ఉపాధ్యాయుడు తప్పు చేసినట్టు తెలితే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కిరణ్ కుమార్ అన్నారు.