మార్కాపురం శ్రీ విద్య కోచింగ్ సెంటర్లో జన విజ్ఞాన వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక పట్టణ అధ్యక్షులు చక్కిలం శ్రీధర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం జన విజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తుందన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు యు వెంకట్ రావు మాట్లాడుతూ మూఢనమ్మకాలకు పారద్రోలి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.
ఎస్ వి కె పి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మిరియాల నాసరయ్య మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక సైన్స్ అంశాలను ప్రజల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జన విజ్ఞాన వేదిక డివిజన్ కార్యదర్శి ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాదేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి కే పి కళాశాల చరిత్ర అధ్యాపకులు పొన్నబోయిన ఆవులయ్య, ఐ. పిచ్చేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు మర్రిపూడి రామకృష్ణ, జే. శేఖర్, నాగూర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.