మార్కాపురం: జారిపడి వ్యక్తి మృతి

57చూసినవారు
మార్కాపురం: జారిపడి వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సత్యనారాయణ (75) ఇంటిలో జారిపడి మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటిలో ఎవరు లేకపోవడంతో మృతుడు మృతి చెందిన విషయం ఐదు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో తెలిసినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్