ఒంగోలులో నేడు ఉద్యోగ మేళా

578చూసినవారు
ఒంగోలులో నేడు ఉద్యోగ మేళా
ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఉద్యోగ మేళాలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, విద్యార్థులతో దృవీకరణ పత్రాలు జిరాక్స్ లను వెంట తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్