మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు కేశవరావు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ను కోరారు. పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత చైర్మన్ పై ఉందని తెలిపారు.