ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జలను సత్వరమే సంబంధిత అధికారులు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని చట్ట పరిధిలో పరిష్కరించాలని, ఈ సందర్భంగా ఎస్పీ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 81 ఫిర్యాదులు వచ్చినట్లుగా ఎస్పి తెలిపారు.