
పల్నాడు: ఈనెల 27న వైసీపీ పోరుబాట: గోపిరెడ్డి
పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట ను 27వ తేదీన నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి గృహ వినియోగదారులపై రూ. 15, 485 కోట్ల భారం మోపిందన్నారు. ఛార్జీలు తగ్గించేవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.