
మార్టూరు: ఎమ్మెల్యే ఏలూరి సారధ్యంలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారధ్యంలో శనివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో వృద్ధులకు ఉచిత కళ్ళజోళ్ళ, మందులను శనివారం మార్టూరులో పంపిణీ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే ఏలూరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. క్యాంపులో 150 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. నెలరోజుల తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్ళజోళ్ళు, మందులను అందజేశారు.