
కారంచేడు: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ
కారంచేడు మండల పరిధిలోని గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడితే శాఖపరమైన చర్యలు తప్పవని కారంచేడు ఎస్సై వెంకటరావు శుక్రవారం హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు మండలంలో ప్రతిరోజు పోలీసు గస్తీ ఉంటుందన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.