AP: శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వెళ్లే నల్లమల ఘాట్ రోడ్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శుక్రవారం మ.12 గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ రహదారి పైనే నిలిచిపోయింది. దీంతో తుమ్మల బైలుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మలుపు వద్దనుంచి ఇరువైపులా వచ్చి పోయే వాహనాలన్నీ ఆగిపోయాయి. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.