కారంచేడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పని చేసి వెళ్లిన అంజయ్యను తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నియమించవద్దని కోరుతూ గ్రామస్తులు శనివారం డిపిఓకు వినతి పత్రం అందజేశారు. కారంచేడులో గతంలో అంజయ్య పని చేసినప్పుడు నిధుల గోల్మాల్ జరిగిందని, అతని అక్రమాలకు అంతు లేదని, పైగా గ్రామస్తుల మధ్య కూడా చిచ్చు పెడతారని వారు చెప్పారు. ఒకవేళ అంజయ్యను ఇక్కడ కార్యదర్శిగా నియమిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.